మీ భవిష్యత్ కోసం పాటు పడే నాయకుడు పవన్ కల్యాణ్: రామ్ చరణ్

  • పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్
  • పవన్ ప్రజల కోసం ముందుండే వ్యక్తి అంటూ చిరంజీవి వీడియో సందేశం
  • చిరు వీడియోను షేర్ చేసిన రామ్ చరణ్
  • తాను జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు వెల్లడి
అమ్మ కడుపున ఆఖరివాడుగా పుట్టినా, జనం కోసం పోరాడడంలో ముందుండే వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఇవాళ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో విడుదల చేయడం తెలిసిందే. పిఠాపురం జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు మద్దతుగా చిరంజీవి ఈ వీడియో సందేశం ఇచ్చారు. సరిగ్గా చెప్పాలంటే పవన్ కల్యాణ్ సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడని, కానీ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చాడని చిరంజీవి వెల్లడించారు. 

కాగా, చిరంజీవి వీడియోను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీ భవిష్యత్ కోసం పాటు పడే నాయకుడు పవన్ కల్యాణ్ గారిని గెలిపించండి అని పిలుపునిచ్చారు. తాను జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నానని రామ్ చరణ్ తెలిపారు.

Ram Charan
Pawan Kalyan
Pithapuram
Chiranjeevi
Video
Janasena
General Elections-2024

More Telugu News